ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబరు నెలలో రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయని, వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెలలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాన్ల ప్రభావంతో అక్టోబరు 10 తర్వాత కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Share