వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్కి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్దిరోజులుగా వైసీపీ రాజకీయం చేస్తోంది. వేర్వేరు కారణాలతో మృతిచెందిన వారికి డయేరియాను ఆపాదిస్తోంది. 11 మంది మృత్యువాత పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని అహేతుకంగా విమర్శించేందుకు ఏకంగా గుర్ల గ్రామానికి నేడు వస్తున్నారు.
Share