Current Date: 27 Nov, 2024

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బేబీ నాయనా..

బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 29వ వార్డు గంగుల వీధికి చెందిన సిద్ధ రేవంత్ రమణ కుమార్ అనే యువకుడుకు వెన్నుముక సమస్య తో బాధపడుతున్నారు. అతని సమస్యను ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కె రంగారావుకి  తెలియజేయగా  ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే ఆమోదం తెలిపారు. సీయం సహాయ నిధి చెక్కును రూ 2,28,860 ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కె రంగారావు, రేవంత్ రమణ కుమార్ తండ్రి సిద్ధ జగదీష్ ప్రసాద్ కు క్యాంప్ కార్యాలయంలో చెక్కు అందజేశారు. తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన వడ్డీ ఇందిర కి అనారోగ్యం తో బాధపడుతుంటే, ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎబైవేల రూపాయలు చెక్కు అందజేశారు.

Share