Current Date: 04 Jul, 2024

ఏపీ ఎన్నికల ఫలితాలపై స్టాక్ మార్కెట్ చూపు!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎవరు గెలువబోతున్నారు? ఇప్పుడు ఏపీతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ప్రతిపక్షాలు ఏకమవగా.. సీఎం జగన్ ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. అలానే పోలింగ్ కూడా మునుపెన్నడూ లేని రీతిలో 81 శాతం నమోదవడంతో ఇంట్రస్ట్ మరింత పెరిగింది. చివరికి స్టాక్ మార్కెట్ కూడా ఏపీ ఫలితాలపై చూస్తుండటం గమనార్హం.

జీకే అగర్వాల్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఏపీలో ఎన్నికల ఫలితాలపై చాలా మంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు. నేను గమనించిన దాని ప్రకారం.. నా అంచనా ఏంటంటే? వైయస్‌ఆర్‌సీపీ 50-60 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. మరోవైపు ఎన్డీయే కూటమి 125-135 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని జోస్యం చెప్పారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. పోలింగ్ రోజున ఓట్లు వేయడానికి ప్రజలు పోటెత్తినా.. ఎవరికి వైపు నిలబడ్డారో మాత్రం చెప్పడానికి ఓటర్లు ఇష్టపడటం లేదు. దాంతో గుంభనంగా పడిన ఓట్లు ఎవరికి అధికార పట్టం కట్టబోతుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.