స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ అయిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఇక ప్రస్తుతం సమంత మళ్లీ నటనలో బిజీ అయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' త్వరలోనే విడుదల కానుంది. దాంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా" అని ఆమె చెప్పుకొచ్చారు.
Share