Current Date: 31 Mar, 2025

ఐపీఎల్‌లో మళ్లీ ఓడిన రాజస్థాన్.. కోల్‌కతా హ్యాపీ

ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఎట్టకేలకి పుంజుకుని బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌ల 8 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఆ జట్టు వికెట్ కీపర్ డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ 9 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. ధ్రువ్‌ జురెల్‌ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు వరుసగా ఇది రెండో ఓటమికాగా.. బెంగళూరు చేతిలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతాకి ఇది ఊరటనిచ్చే విజయం.ఇప్పటివరకు జరిగిన ఐదు ఐపీఎల్ మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20కిపైనే ఉన్నాయి. దాంతో అభిమానులు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.

Share