Current Date: 06 Jun, 2026

డాక్టర్ ఆనంద్ గుప్తాపై దాడిని తీవ్రంగా ఖండించిన విశాఖ ఐఎంఏ

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ గుప్తా, అలాగే మరికొందరు వైద్యులపై జరిగిన ఘోర దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ విశాఖపట్నం శాఖ డిమాండ్ చేసింది.
ఈ సమావేశంలో ఐఎంఏ విశాఖపట్నం శాఖ అధ్యక్షురాలు డాక్టర్ ఐ. వాణి, సెక్రటరీ డాక్టర్ ఎం. వి. వి. మురళీ మోహన్ మరియు ఐఎంఏ విశాఖపట్నం శాఖ సభ్యులు పాల్గొన్నారు.