ఏపీ సీఐడీ డిస్టిలరీస్‌పై దండెత్తింది. ఏకకాలంలో 30 చోట్ల 20 బృందాలు తనిఖీలు చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 6చోట్ల తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో 2 చోట్ల దాడులు చేశారు. ఏలూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖలోనూ సోదాలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ దాడులు కొనసాగే ఛాన్స్ ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదికూడా ఏకకాలంలో సోదాలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 2019-24 మధ్య అమ్మకాలు, సరఫరాపై సీఐడీ ఆరా తీస్తోంది. తయారైన క్వాంటిటీ, షాపులకు సప్లై అయిన క్వాంటీటీలో తేడాలున్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్టిలరీలు అనధికారిక మద్యాన్ని సరఫరా చేస్తూ.. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది.
Share