Current Date: 26 Nov, 2024

భార్యపై కోపాన్ని కూతురిపై చూపిన తండ్రిబడిలో బిక్కుబిక్కు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మా నాన్న నన్నుఎవరికైనా అమ్మేస్తాడు.. నేను ఇంటికెళ్లను అంటూ 6వ తరగతి విద్యార్థిని బడిలో దాక్కున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ బాబానగర్‌కు చెందిన అక్బర్‌ దంపతులు కొన్ని నెలల క్రితం చౌటుప్పల్‌కు వచ్చారు. అక్కడే నివాసముంటున్నారు. వారి కుమార్తె(11)ను ఈ సంవత్సరమే చౌటుప్పల్‌లోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు.కొన్ని రోజుల క్రితం బాలిక తల్లి.. తన మూడేళ్ల కుమారుడిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న తండ్రి భార్యపై కోపాన్ని కుమార్తెపై చూపుతూ వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి కుమార్తెను కొట్టాడు. దీంతో గురువారం బాలిక బడికి రాలేదు. మధ్యాహ్నం సమయంలో బిక్కుబిక్కుమంటూ వచ్చిన బాలిక ఆకలిగా ఉందంటూ స్నేహితురాళ్ల వద్ద వాపోయింది.స్పందించిన వారు జరిగిన విషయాన్ని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో.. ఆమె భోజనం పెట్టించి ఓదార్చారు. 

 

Share