Current Date: 04 Jul, 2024

శ్రీవారి భక్తులకు అలర్ట్... నేడు తిరుమలలో ఆగస్టు నెల టికెట్లు విడుదల...

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు ఆగస్టు నెల టికెట్లు రిలీజ్ చేయనున్నారు. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది. నేటి ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చెయ్యనుంది.కాగా, తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు సైతం నేటి నుంచి షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై వీఐపీ బ్రేక్ దర్శనాల జారీని టీటీడీ పాలక మండలి పున: ప్రారంభించింది.