Current Date: 27 Nov, 2024

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ఫస్ట్ టెస్టు రికార్డ్ ముంగిట కోహ్లీ

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 53 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున ఇప్పటివరకు సచిన్‌ టెండూల్కర్‌ 15,921 పరుగుల, రాహుల్ ద్రవిడ్ 13,265 పరుగులు, సునీల్ గవాస్కర్ 10,122 పరుగులు మాత్రమే 9 వేల పైచిలుకు పరుగులు చేసిన క్రికెటర్లుగా ఉన్నారు. ఈరోజు కోహ్లీ ఆ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.టెస్ట్‌ల్లో ఈ ఏడాది పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్‌ రేపటి ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సౌతాఫ్రికాపై 2023లో చేసిన  46 పరుగులు.. బంగ్లాదేశ్‌పై చేసిన ఇటీవల చేసిన 47 పరుగులే ఈ ఏడాది అతనికి అత్యధికం. కనీసం ఈ బెంగళూరు టెస్టులోనైనా కోహ్లీ ఫామ్ అందుకోవాలని భారత్ కోరుకుంటోంది.

Share