నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలు సోమవారం విడుదలయ్యాయి. వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈక్రమంలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారి ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు వెల్లడిరచింది. మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించగా 813 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ ఫలితాల తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్‌టీఏ వెల్లడిరచింది. సవరించిన స్కోర్ కార్డులను https://exams.nta.ac.in/NEETలో చూసుకోవచ్చు. త్వరలోనే నీట్ కౌన్సెలింగ్ జరగనుంది.
Share