ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7 వేల పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన టీ తాగారు.