Current Date: 07 Oct, 2024

వాంఖడేలో హార్దిక్‌ను తిట్టిన వాళ్లే నోరారా ప్రశంసలు!

బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయనే సామెత ఇప్పుడు హార్థిక్ పాండ్యాకు చక్కగా వర్తిస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024లో  విమర్శించిన నోళ్లే ఇప్పుడు హార్ధిక్.. హార్ధిక్ అంటూ నీరాజనాలు పలుకుతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో చివరి ఓవర్‌ని తెలివిగా వేసిన హార్దిక్ పాండ్య.. భారత్‌కి కప్ అందించిన విషయం తెలిసిందే.ముంబైలో జరిగిన టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్‌కు ముందు ముంబైలోని వాంఖడే స్టేడియం ‘హార్దిక్, హార్దిక్’ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. నిజానికి ఐపీఎల్ సందర్భంగా అదే వాంఖడే స్టేడియంలో హార్ధిక్‌ను తీవ్రస్థాయిలో అభిమానులు గేలి చేశారు. ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు కెప్టెన్సీ కట్టబెట్టడంతో జీర్ణించుకోని ముంబై అభిమానులు సీజన్ సాంతం పాండ్యాపై విమర్శలు గుప్పించారు. కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి ఓవర్లో 16 పరుగులను డిఫెండ్ చేసి జట్టును విజయ తీరాలకు హార్దిక్ చేర్చాడు. ప్రపంచ కప్ ఫైనల్ గెలిచాక పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల హార్దిక్ పాండ్య భార్య విడాకులు తీసుకుని.. వేరొకతనితో రొమాంటిక్‌గా తిరుగుతున్న వీడియోలను వరుసగా షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

Share