Current Date: 02 Jul, 2024

సమ్మర్‌లో నైటీలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సమ్మర్ వచ్చేసిందంటే చాలా వేడికి తట్టుకోలేక బయటకు వెళ్లలేక అందరూ ఇంట్లోనే కూర్చుంటారు.. చల్లగా కూలర్, ఏసీ కింద ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఎక్కువ మంది కాటన్ దుస్తులను మాత్రమే వేసుకుంటారు. చాలా మంది మహిళలు రాత్రుళ్ళు వేసుకోనే నైటీలను పగలు కూడా వేసుకుంటారు


ఉక్కపోతని తట్టుకోవడం కోసం ఆడవాళ్లు ఎక్కువగా నైటీలల్లో కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే మహిళలు నిద్ర బాగా పట్టాలని నైటీలు వేసుకునేవారు.. కానీ రానురాను పట్టు చీరలకు పని చెప్పకుండా నైటిలల్లోనే దర్శనం ఇస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు.. ఉదయం స్నానం చేయగానే నైటీ ధరించి దానిపైనే ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తుంటారు. కారణం ఏదైనప్పటికీ ఆడవాళ్లు నైటీ కి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం మామూలేదు..

చాలా మంది పాలిస్టర్ నైటీలు వేసుకుంటుంటారు.. అలాంటి వాళ్లు చెమటలు పడ్డా, లేదా చేతులను కడిగిన తర్వాత నైటీలకు మాత్రమే తుడుచుకుంటారు. ఈ విధంగా చెయ్యడం వల్ల మనకు తెలియకుండానే క్రీములు మన శరీరంలోకి వెళ్లి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అయితే చెమటలు తుడుచుకుంటూ ఉంటే.. బ్యాక్టీరియా ఫామ్ అయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.. అందుకే కాటన్ నైటీలు ధరించాలి. అలానే ఎప్పటికప్పుడు ఉతికిన నైటీలను మాత్రమే వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీతో పాటు ఇంట్లోని వాళ్లందరికీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది.