Current Date: 23 Sep, 2024

నేడే కేజీవాల్ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవాల్ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గహోత్ CM రేసులో ముందున్నారు. 

Share