Current Date: 07 Oct, 2024

అనకాపల్లి నూకాంబికా అమ్మవారి సేవలో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌

ఉత్తరాంధ్ర ఇలవేల్పు  అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారిని శుక్రవారం అనకాపల్లి జిల్లా కొత్త కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో పూర్ణకంభంతో స్వాగతం పలికి, ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ మండపంలో ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఈవో బండారి ప్రసాద్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చిన్నికృష్ణ, టీడీపీ జనసేన పార్టీ నాయకులు పీల నాగ శ్రీను, బీఎస్‌ఎన్‌ కే జోగి నాయుడు, తాడి రామకృష్ణ, ఆళ్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

Share