Current Date: 01 Oct, 2024

శభాష్ సోనూసూద్ చంద్రబాబు ప్రశంసలు

ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ టీం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో వారికి తాము అండగా ఉంటామని సోనూసూద్ వీడియోలో పేర్కొన్నారు. సాయం కోరుకునే వారు సోనూసూద్‌ చారిటీ ఫౌండేషన్ ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. మెయిల్‌లో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా  సోనూసూద్ సాయం చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధతను కొనియాడారు. సోనూసూద్ సాయం ప్రజలకు ఓదార్పునిస్తుందని పేర్కొన్నారు.

Share