విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. బొగ్గు నిల్వలు అడుగంటిపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. విశాఖ పోర్ట్ తో పాటు ఏజీపీఎల్ నుంచి కూడా బొగ్గు సరఫరా నిలిచి పోయింది. బుధవారం నాటికి కూడా ఏజిపిఎల్ నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. 2లక్షల 50వేల టన్నుల ముడిసరుకు అదానీ గంగవరం పోర్టు లో ఉన్నప్పటికీ ఏపీ హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే గాని సరకు దిగుమతి కాదు. బకాయిలు పెండింగ్ లో ఉండడంతో ఇప్పట్లో ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు . ఇదిలా ఉంటే బుధవారం ఉదయానికి 14వేల టన్నుల ముడిసరకు మాత్రమే ఉందని ప్లాంట్ వర్గాలు తెలిపాయి. త్వరలో స్టీల్ ప్లాంట్ కు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవని ఉద్యోగులు చెబుతున్నారు.
అయితే ఈ పరిస్థితి పై యూనియన్ నాయకులు ఇప్పటికీ ప్రజా ప్రతినిధులను ప్రశ్నించక పోవడం పై తీవ్ర విమర్శలు ఎదురవు తున్నాయి.
Share