Current Date: 06 Oct, 2024

బెయిల్‌పై విడుదలైన నటి హేమఓవరాక్షన్ తెచ్చిన తంట!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెయిల్‌పై విడుదలైంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన హేమకి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ జరిగింది. వంద మందికి పైగా ఆ పార్టీకి హాజరయ్యారు. ఆకస్మికంగా దాడులు చేసిన పోలీసులు అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టుల్లో వెల్లడైంది. ఇందులో హేమ కూడా ఒకరు.ఆ టైమ్ లో తను హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌజ్ లో ఉన్నానంటూ హేమ ఓ వీడియో రిలీజ్ చేశారు. మరుసటి రోజు వంట చేస్తూ మరో వీడియోను కూడా విడుదల చేసి బుకాయించే ప్రయత్నం చేశారు. 

Share