Current Date: 06 Oct, 2024

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ప్రత్యక్ష ప్రసారం

ఈ నెల 12న బుధవారం ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విశాఖ కలెక్టర్ పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజలు వీక్షించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గుర్తించిన ఏడు కేంద్రాల్లో ఎల్ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రకాల కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజలు చూసేందుకు వీలుగా కేంద్రాల వద్ద కుర్చీలు వేయిస్తున్నామని, తాగు నీటి వసతి కల్పిస్తున్నామని చెప్పారు. 

Share