Current Date: 06 Oct, 2024

రాష్ట్రపతి భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో చిరుత..?

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 72 మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల ఆహ్వానితులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు.అయితే, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.  రాష్ట్రపతి భవన్‌లో ఓ విచిత్ర జంతువు సంచరించడం కనిపించింది. మంత్రిగా దుర్గాదాస్ ఉయికే ప్రమాణం చేసిన తర్వాత రిజిస్టర్‌లో సంతకం పెడుతున్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ మెట్ల మీద విచిత్ర జంతువు తిరుగున్నట్లు అక్కడి వీడియోల్లో రికార్డైంది. 

Share