Current Date: 06 Oct, 2024

రేణు దేశాయ్‌కి పవన్ ఫ్యాన్ ఉచిత సలహా.. ఇచ్చిపడేసింది

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ల మధ్య వివాహ బంధం ఏ విధంగా ముగిసిందనేది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ కొందరు నెటిజన్లు ఇప్పటికీ ఈ అంశంపై రేణు దేశాయ్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో రేణు దేశాయ్ ఘాటుగానే సమాధానాలు ఇస్తుంటారు. తన వ్యక్తిగత జీవితంలోకి పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకురావొద్దని కూడా ఆమె కోరుతుంటారు.తాజాగా ఓ నెటిజన్ పవన్ - రేణు దేశాయ్‌లో వివాహ బంధం ముగిసేందుకు రేణు దేశాయ్ కారణమనే రీతిలో ఆరోపణలు చేస్తూ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు. రేణు దేశాయ్ కొన్నేళ్లు ఓపిక పట్టుంటే బాగుండేదని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ‘‘వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే బాగుండేది.. ఒక దేవున్ని వివాహం చేసుకుని ఆయన అంతరం తెలియకుండా వెళ్లిపోయారు.. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా.. విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. చాలు వదిన.. మేము నిన్ను మిస్ అవుతున్నాం వదిన’’ అని ఆ నెటిజన్ పోస్టు చేశారు.ఈ పోస్ట్‌కు రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు ‘‘మీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పేవారు కారు. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు.  

Share