మాజీ సీఎం వైయస్ జగన్‌తో అంటకాగిన శ్రీలక్ష్మి ఐఏఎస్‌ని టీడీపీ ఓ ఆట ఆడుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో ఏపీ పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న ఆమెకి.. గత వారం రోజులుగా తీవ్ర పరాభవాలు ఎదురవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆమె చేతి నుంచి బుకే తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. నిన్నటి నిన్న మంత్రి నారాయణ కూడా ఆమెని అవమానించేలా వ్యవహరించారు.మంత్రి సంతకం కోసం శ్రీలక్ష్మి ఫైల్ తీసుకెళ్లారు. అయితే శ్రీలక్ష్మిపై అనధికార నిషేధాన్ని టీడీపీ విధించిన నేపథ్యంలో, ఇప్పుడు సంతకాలు చేసేవేవీ లేవంటూ మంత్రి నారాయణ తిరస్కరించారు. దాంతో శ్రీలక్ష్మి అందరి ముందు నొచ్చుకుంటున్నట్లు కనిపించింది. జీవోలపై శ్రీలక్ష్మి సంతకం ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి సంబంధించిన జీవోపై కూడా శ్రీలక్ష్మి సంతకం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతోనే జీవో విడుదల కావడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో జగన్ అనుకూల ఉన్నతాధికారులంతా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు రావచ్చని ప్రచారం జరుగుతోంది.
Share