సీనియర్ హీరోయిన్ వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ అవుతోందా? అంటే అవుననే అంటున్నారు చాలామంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో, ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. ఇదే కనుక నిజమైతే, జీవితంలో వనిత విజయ్ కుమార్ కు ఇది నాలుగో పెళ్లి.పెళ్లిళ్లు, పెటాకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వనిత విజయ్ కుమార్ మొదట ఆమె నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక బంధంలో ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ బంధం వీగిపోయింది. ఆ తర్వాత ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇతడితో కూడా ఐదేళ్లు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ ను పెళ్లాడింది. 2020 జూన్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే హనీమూన్ నుంచే వీళ్ల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి.ఇప్పుడు నాలుగోతని పేరు రాబర్ట్. కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్. గమ్మత్తైన విషయం ఏంటంటే.. పీటర్ పాల్ తో పెళ్లికి ముందు రాబర్ట్ తో వనిత డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, పీటర్ ను పెళ్లి చేసుకుంది. 43 ఏళ్ల వనిత-రాబర్ట్ ఓ సినిమా కూడా చేస్తున్నారు.
Share