మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌లో గాయపడ్డారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా, చరణ్ కంటి దగ్గర స్వల్ప గాయమైనట్లు సమాచారం. అయితే, ఇది చాలా చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున 'పెద్ది' టీజర్‌ను విడుదల చేస్తారని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తొలుత మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 30న కూడా సినిమా రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. నిర్మాణ పనులు, షూటింగ్ ఆలస్యం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది.
Share