Current Date: 05 Oct, 2024

మహిళా బాక్సర్‌తో పురుషుడి పోటీ ఒలింపిక్స్‌లో కొత్త వివాదం

ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినీ, 66 కిలోల వెల్టర్ వెయిట్ విభాగంలో అల్జీరియన్ బాక్సర్ ఇమాన్ ఖలీఫ్‌తో తలపడినప్పుడు, మ్యాచ్ ప్రారంభమైన కేవలం 46 సెకన్లలోనే పోటీ నుండి వైదొలిగింది. కారణంగా, ఇమాన్ ఖలీఫ్ పురుషుడిలా శారీరక లక్షణాలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.ఈ వివాదం, ఖలీఫ్ గతంలో నిర్వహించిన లింగనిర్ధారణ పరీక్షలో విఫలమవడంతో మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా ఉండటంతో ప్రారంభమైంది. అంతేకాక, అతని డీఎన్ఎ పరీక్షలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి డీఎన్ఏ టెస్టులో ఇమాన్ ఖలీఫా అమ్మాయి కాదని తేలింది. ఈ నేపథ్యంలో, ఖలీఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ ఆర్గనైజేషన్ నిషేధం విధించింది. ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల కారిని ఖలీఫా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె ముక్కుకు గాయం కావడంతో పాటు ధరించిన మాస్క్ కూడా తెగిపోయింది. దీంతో కారిని వెంటనే తన కోచ్‌తో మాట్లాడి పోటీ నుంచి తప్పుకుంది. బాక్సింగ్ రింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన ఏంజెలా కారినీ కంటతడి పెట్టుకుంది. ఇది చాలా విచారంగా ఉందంటూ తెలిపింది. “నా జీవితంలో ఇంత బలమైన దెబ్బ ఎప్పుడూ అనుభవించలేదు” అని ఆమె చెప్పింది. 

Share