Current Date: 27 Nov, 2024

బురద నీరే తాగాలి

 మన్యం మలేరియా జ్వరాలతో వణికిపోతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి తదితర కొండ శిఖర గ్రామాల్లో గత రెండేళ్ల నుంచీ మలేరియాతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు దాదాపు 28కుటుంబాల్లో 15మంది ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అయినా ఐటీడీఏ, వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మలేరియా జ్వర పీడితులు వైద్యం కోసం విజయనగరం జిల్లా గజపతినగరం వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామాలకు  మంచి నీటి సౌకర్యం కూడా లేదు. బురద నీరే తాగాల్సి వస్తోంది. అందువల్లే మలేరియా జ్వరాలకు గురవుతున్నారు. కనీసం మంచి నీరందించేందుకు కూడా ఐటీడీఏ అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో గత్యంతరం లేక గిరిజనులు ఇప్పటికీ మురికి నీరే తాగుతున్నారు. ఈ ప్రాంతంలో సోములు, వీరయ్య, బడ్నాయిని కొత్తమ్మ, భూరుగా సుంకరయ్య, సోములు, పోలమ్మ, సోములు, జెంట్స్‌ మేరీ, పొట్టంగి పోలయ్య, బడ్నాయిని బుజ్జిబాబు, కిరణ్‌ కుమార్‌ తదితరులంతా జ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు, వీరందర్నీ డోలీల్లో మోసుకొని 8కి.మీ దూరంలోని ఆస్పత్రికి తరలించేందుకు నరకం చూడాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు.

Share