Current Date: 27 Sep, 2024

దేవర సినిమా చూస్తూ ఎన్టీఆర్‌ అభిమాని మృతి

కడపలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన తోటి అభిమానులు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని జమ్మలపల్లికి చెందిన మస్తాన్‌వలి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని. దేవర సినిమా విడుదల సందర్భంగా కడప అప్సర థియేటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున సినిమా చూస్తూ ఈలలు, కేకలు వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మస్తాన్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మస్తాన్‌వలి మృతితో ఆ కుటుంబం అనాథగా మారింది.

Share