కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్‌కల్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అక్కడి అధికారులతో చర్చించారు. కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఒప్పందం శుక్రవారం జరిగింది.
Share