మాజీ పార్లమెంట్ సభ్యలు, వైసీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ కార్యాలయం పై శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ప్రారంభమాయ్యాయి. ఎంవీవీ విశాఖ, హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. దీనికి తోడు రాష్ట్రంలో వైసీపీ తుడుచు పెట్టుకు పోయింది. అప్పటి నుంచీ ఎంవీవీ కష్టాలు పీక్ కు చేరాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వల్ల రోజుకో కష్టం ఏర్పడుతోంది.