మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16, 17న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్‌తో పాటే ఉంటారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు వారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు.
Share