టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో టీమ్‌ఇండియా ప్రస్తావన వచ్చింది. మన జట్టుకు ఎంపీలంతా అభినందనలు తెలియజేశారు. తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ అవకతవకల అంశాన్ని లేవనెత్తారు. వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సిఉందన్నారు. అయితే ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, శూన్య గంటలు లేవు కాబట్టి, వాయిదా తీర్మానాలు తీసుకోవడం కుదరదని విపక్ష సభ్యులకు స్పీకర్ తెలియజేశారు.