Current Date: 05 Oct, 2024

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భైరా దిలీప్ చక్రవర్తి

టీడీపీ తన వ్యూహం మార్చుకుంది. మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి పార్టీల తరపున స్తబ్దుగా ఉండిపోదామని భావించిన కూటమి పార్టీలు ఇప్పుడు అకస్మాత్తుగా టర్న్ అయ్యాయి. తమ తరపున భైరా దిలీప్ చక్రవర్తి పేరును ఖరారు చేసింది. నేడో రేపో అధికారిక ప్రకటన కుడా వెలువడనుంది. వైసీపీ తరపున ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించగా కూటమి పార్టీ ఇప్పటివరకు తేల్చలేదు. బొత్స సీనియర్ కావడం, వైసీపీకే అధికంగా ఓట్లు ఉండడంతో ఈ ఎన్నికల్లో ఎవరినీ పోటీకి దించచకూడదనే కూటమి భావించింది. అయితే నేతల పునరాలోచన కారణంగా భైరా పేరు పరిశీలించినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన భైరా కాపు సామాజిక వర్గానికి చెందినవారు, కొన్నాళ్ళు విదేశాలకు వెళ్లి వచ్చారు. గతంలో కొన్నాళ్ళు జనసేన పార్టీకి పనిచేశారు. భైరా ఫౌండేషన్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గత సాధారణ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించారు. అక్కడే అద్దెకు కార్యాలయం తీసుకుని నెలల కొలదీ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే మారిన పరిణామాల కారణంగా కూటమి తరపున సీఎం రమేష్ కు టిక్కెట్ దక్కడంతో దిలీప్ చక్రవర్తి మౌనంగానే ఉండిపోవాల్సి వచ్చింది. 

 

Share