Current Date: 06 Oct, 2024

హీరో రాజ్ తరుణ్‌ని వదలని లావణ్య మళ్లీ గొడవ

హీరో రాజ్ తరుణ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. మాల్వి మల్హోత్రాతో అతను జంటగా నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ పాల్గొన్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని అతని మాజీ లవర్ లావణ్య అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాజ్ తరుణ్‌ను కలవాలని గేటు దగ్గర గొడవ చేసింది. అయితే, ఆమెను సెక్యూరిటీ వాళ్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. “నా మొగుడు రాజ్ తరుణ్‌తో హీరోయిన్ ఎలా సహజీనం చేస్తుంది? అతడు తప్పు చేయకుంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు?” అంటూ గొడవ చేసింది. అయితే, ఆమెను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. లావణ్యతో వివాదం, కేసుల గురించి ప్రెస్‌మీట్‌లో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ  ‘వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. విమర్శలకు గురయ్యాను. ఈ వివాదం కారణంగా చాలా రోజులుగా ఇంట్లో కూర్చొని బాధ పడుతున్నాను. నాతోపాటు నా పేరెంట్స్ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. నేనే హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎక్కడికి పారిపోలేదు” అని చెప్పుకొచ్చారు.

Share