Current Date: 04 Jul, 2024

విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం ...మంత్రి గుడివాడ అమర్నాథ్‌

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీకే ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు  రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ జోష్యం చెప్పారు. ఈ మేరకు గురువారం బీచ్‌ రోడ్డులోని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స రaాన్సీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండుటెండను లెక్క చేయకుండా రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారన్నారు. మరల జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందని తెలిపారు. తాము కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకి వెళ్లి ఓట్లు విజ్ఞప్తి చేస్తున్నప్పుడు స్పందన పూర్తిస్థాయిలో కనబడిరదన్నారు. ముఖ్యంగా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జగన్మోహన్‌ రెడ్డి వస్తేనే తమ కుటుంబాలు బాగుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. రకరకాలుగా భిన్నభిప్రాయాలు వస్తున్నాయని, పోలింగ్‌ పర్సంటేజ్‌ గతంలో కన్నా ఎక్కువ  పర్సంటేజ్‌ అవ్వడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నారన్నారు. 2004లో చంద్రబాబు మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ఆరోజు రాజశేఖర్‌ రెడ్డి విజయం సాధించారని, 2009కి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిరదో,  టీడీపీ సిపిఐ సిపిఎం టిఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని, అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్‌ అయిందని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి మీద వ్యతిరేకత వచ్చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పారని,  ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. రేపు కూడా అదే రిపీట్‌ అవ్వబోతుందని ఆయన జోష్యం చెప్పారు. రానున్న కాలంలో మరింత మెరుగైన పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందించి యువతీకి ఉపాధి అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు.