పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పిఠాపురంలో ఈ నాలుగు రోజులు… ఏది జరిగినా కూడా సెన్సేషనే. నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిందో…అప్పటి నుంచీ కూడా ట్రెండింగ్‌లోకి పిఠాపురం వెళ్లిపోయింది. అక్కడ ప్రచారమే కాదు.. పోలింగ్ కూడా ఆసక్తిగా సాగింది. కౌంటింగ్ ముంగిట పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ రేడియం స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్లో నడుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పవన్ అనుచరులు మొదలు పెట్టిన మైండ్ గేమ్‌కి వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేశారు.బైకులు, కార్లు, ఆటోలు ఇలా పిఠాపురంలో ఎక్కడ చూసినా రేడియం రేలారే రేలారే పడుతున్నాయి. ఫైనల్ గా ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఏం తేలకముందే.. ఏంటీ స్టిక్కర్ల వార్ అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.