ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దన్నర కాలం సినిమాల్లో రాణించిన ఆమె.. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
2019లో రోజా చరాస్తులు రూ.2.74 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.4.58 కోట్లకు పెరిగింది. అలాగే 2019 స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.6.05 కోట్లు అయ్యింది. ఐదేళ్లలో రూ.81 లక్షలు పెరిగాయి. 2019లో ఆరు కార్లు, ఒక బైక్ ఉండగా.. వాటి విలువ రూ.1.08 కోట్లు. ఇప్పుడు 9 కార్లుండగా.. విలువ రూ.1.59 కోట్లు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా.. ఇప్పుడు ఒక్కటీ లేకపోవడం గమనార్హం.