Current Date: 02 Jul, 2024

Magadheera movie Villan like scene in khanapur..| #todaynews #khanapur #breakingnews

మగధీరలో విలన్‌లా మాజీ ప్రేయసి పెళ్లి చెడగొట్టి.. | Magadheera movie Villan like scene in khanapur..| #todaynews #khanapur #breakingnews #tsnews #telangananews #crime_news #nirmaldistrict #viralnews #viralvideo #viralstory 

మగధీర సినిమాలో విలన్ తరహాలో తనకు దక్కని అమ్మాయి ఎవరికీ దక్కకూడదనుకున్న ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి కడతేర్చాడు. అడ్డువచ్చిన యువతి వదినపైనా దాడి చేశాడు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఓ ఆన్‌లైన్‌ సంస్థలో డెలివరీబాయ్‌గా పని చేస్తున్న ఖానాపూర్‌ పట్టణ పరిధి అంబేడ్కర్‌నగర్‌ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్‌(28), అదే కాలనీలో ఉంటున్న గంగారాం-గంగవ్వల చిన్నకుమార్తె చెటుపల్లి అలేఖ్య(22) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుమార్తెను మందలించారు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు మూడు నెలల క్రితం నిర్ణయించారు. కానీ.. పెళ్లి నిశ్చయమైన విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌, ఆమెను వివాహం చేసుకోబోతున్న యువకుడి కుటుంబ సభ్యులను కలిసి తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. పెళ్లి ఆగిపోయేలా చేశాడు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులు, పెద్దల సమక్షంలో యువకుడికి పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాకపోగా..యువతిపై పగ పెంచుకున్నాడు. అప్పట్నుంచి వేధిస్తూ వస్తున్నాడు. వదిన జయశ్రీతో కలిసి అలేఖ్య కుట్టు శిక్షణకు వెళ్లినట్టు తెలుసుకున్న అతను ప్రణాళిక ప్రకారం చౌరస్తాలో కాపుకాశాడు. ఇంటికి వెళ్తున్న ఇరువురినీ అనుసరించాడు. జన సంచారం లేని ప్రాంతంలో వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తప్పించుకుని పారిపోతుండగా వెంబడించాడు.

తొలుత అలేఖ్యను దొరకబుచ్చుకుని మెడపై నరికాడు. పక్కనే ఉన్న జయశ్రీ చంపొద్దంటూ కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరం చూపకపోగా..ఆమె తలపై, కాళ్లపై కత్తితో నరుకుతూ పక్కకు నెట్టేశాడు. ఈ పెనుగులాటలో ఆమె రెండేళ్ల కుమారుడు రియాన్స్‌ తలకు కత్తి గాయాలయ్యాయి. అనంతరం అలేఖ్యను పలుమార్లు కత్తితో నరికాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.