Current Date: 18 Feb, 2026

పాకిస్థాన్ పై రుద్ర' వాచ్ ధరించి.. మ్యాచ్ ఆడిన హార్దిక్ పాండ్యా!

​టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా..  పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఒక ప్రత్యేకమైన వాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, శివుడిపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన జాకబ్ అండ్ కో సంస్థ తయారు చేసిన 'రుద్ర'  ఎడిషన్ వాచ్‌ను ధరించారు. ఈ వాచ్ డిస్‌ప్లేపై ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడి ప్రతిమతో పాటు 'ఓం' గుర్తు, దేవాలయ ఆకృతులు ఉండటం విశేషం. ​ఈ వాచ్ అత్యంత అరుదైనది, విలాసవంతమైనది.   ప్రపంచవ్యాప్తంగా 25 పీస్‌లు మాత్రమే తయారు చేశారు. దీని ధర దాదాపు రూ. 25 లక్షల నుండి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వాచ్ విలువ పాకిస్థాన్ కెప్టెన్ నెలసరి జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. క్రీడాకారులు మైదానంలో పడే ఒత్తిడిని తట్టుకునేలా ఈ వాచ్ ను రూపొందించారు. ఇది 70 గంటల పవర్ రిజర్వ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.