Current Date: 04 Jul, 2024

పవన్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ కల్కి ఫస్ట్ రిక్వెస్ట్

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రభుత్వంలో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో టాలీవుడ్ పెద్దలు తమ సమస్యలను చెప్పుకుని.. పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లనున్నారు. ఈరోజు ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటుగా.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్‌ని కోరనున్నారని సమాచారం.భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారట. ఈ నెలలోనే కల్కి సినిమాకు అర్జెంటుగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల అనుమతి రావాల్సి ఉంటుంది. జూన్ 27న రాబోతోన్న ఈ చిత్రానికి అన్ని రకాల ఫెసిలిటీస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

Share