Current Date: 06 Jul, 2024

*ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల విద్యార్థినిలపై లైంగిక వేధింపులు

భీమిలి జోన్ సంగివలస ఎన్ఆర్ఐ కళాశాలలో బిఎస్సి  రేడియాలజీ విభాగం  విద్యార్థినీలపై హెచ్ఓడి తుమ్మల.నాగేశ్వరావు లైంగికంగా వేధిస్తున్నారని దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ప్రతిరోజు తరగతులు ముగిసాక  హెచ్ఓడి తన ఛాంబర్ కు రమ్మని అసభ్యకరమైన పదజాలతో, లైంగికంగా వేధించేవారని తెలిపారు.ఈ నెల 3 తేది న లైంగిక వేధింపులపై మరోమారు డీన్ కు బాధిత విద్యార్థినీలు ఫిర్యాదు చేసిన  పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.డీన్ మాత్రం కళాశాల అంతర్గత ఫిర్యాదుల విభాగానికి విచారణ నిమిత్తం పంపించామని చేతులు దులుపుకున్నారు.దీంతో విద్యార్థినీలు ఏబీవీపీ సభ్యులను ఆశ్రయించారు. విద్యార్థినీలు ఏబీవీపీ సభ్యులతో కలిసి డీన్ సుధాకర్ ను నిలదీశారు.ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్న చర్యలు చేపట్టకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ లో విద్యార్థినిలు  ఫిర్యాదు చేశారు.గతంలో నాగేశ్వరరావు పై పలు లైంగిక కేసులు ఉన్నాయని ఆరోపించారు.ఈ నేపథ్యంలో దిశా ఏసీపీ సిహెచ్.వివేకానంద ఆదేశాలతో సీఐ టి.కళ్యాణి దర్యాప్తు చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు చేపడతామన్నారు.