Current Date: 27 Nov, 2024

9న సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 9 న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్,తదితర పుణ్యక్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. స్లీపర్ టికెట్ ధర రూ. 15,510, కంఫర్ట్ కేటగిరి ధర రూ.31,500 గా నిర్ణయించారు.

Share