పామును చూస్తే ఎవరైనా చంపేద్దాం అనుకుంటారు. కానీ విశాఖకు చెందిన పాములు పట్టే నేర్పరి, స్నేక్ కేచర్ కిరణ్ మాత్రం ఓ పాముకి ప్రాణం పోశాడు. సోమవారం ఇక్కడి అగనంపూడిలో ఆరడుగుల నాగుపాము కనిపించందంటూ స్థానికులు భయాందోళనతో రొక్కం కిరణ్ కుమార్ కు ఫోన్ చేశారు. కిరణ్ మెరువు వేగంతో పామున్న ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అప్పటికే ఒక ముంగిస, ఆ పాము చాలా సేపు కొట్లాడుకున్నట్టు అక్కడి పరిస్థితిని బట్టి అర్ధమైంది. పామును తీవ్రంగా కొట్టి, దాడిచేసి అనంతరం స్థానికుల కేకలతో ముంగిస అక్కడినుంచి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అంతే కాకుండా ఆ పాముకు అప్పటికే తీవ్ర రక్తస్రావం అయ్యి చనిపోయే స్థాయిలో గిలాగిలా కొట్టుకుంటోంది. దీంతో అగనంపూడి వేటరనరీ ఆస్పత్రికి ఆ పామును కిరణ్ పట్టుకెళ్లాడు. శరీరం మొత్తం ముంగిస కొరికేయండంతో అక్కడి డాక్టర్ లావణ్య ఆ పామును ప్రాథమిక చికిత్స చేసి, గాయాలైన చోట కుట్లు వేసి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. అంత నాగుపాము కూడా ఊపిరి పీల్చుకుంది. ఒక్కరోజు పాటు అబ్జర్వేషన్ లో ఉంచి, ఆ పాము పూర్తిగా కొలుకున్నాక అడవిలో వదిలేస్తామని స్నేక్ కేచర్ కిరణ్ తెలిపారు.
Share