విజయవాడలో వరద ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. చంద్రబాబు రాత్రినక పగలనక విజయవాడలో తిరుగుతూ వరద బాధితులకి భరోసా ఇస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కానరావడం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గత వారం చివర్లో వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి.విజయవాడ నగరం గత 3 రోజులుగా ఇంతలా అతలాకుతలం అయిపోతున్నా పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడా లేదు. ఒకవేళ ఏపీలో ఉండి వుంటే కనీసం ఓ దగ్గర కాకుంటే మరో దగ్గర అయినా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం వుండేది. కానీ 3 రోజులుగా అలాంటి వార్త ఒక్కటి కూడా లేదు. జస్ట్ ట్విట్టర్‌లో ఓ పత్రికా ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. అది కూడా టీమ్ ఇస్తుంది కాబట్టి పవన్ ప్రమేయం లేదనుకోవాలి.పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఉపముఖ్యమంత్రి కూడా. జనసైనికులు అంతా పవన్‌ను మంత్రి అని పేర్కొనడం లేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులు అని మాత్రమే సంభోదిస్తున్నారు. మరి అలాంటి హోదాలో ఉండి ఇంతటి విపత్తులో కనీసం కానరాకపోవడం వైసీపీ చేతికి అస్త్రం దొరికినట్లైంది. ఓ రేంజ్‌లో ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Share