Current Date: 02 Oct, 2024

ఢీల్లీ - విశాఖపట్నం ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌

విమానాశ్రయానికి నిర్ణీత సమయంలో చేరుకోలేక పోయిన ఓ ప్రయాణికుడు విమానాన్ని కాసేపు ఆపడం కోసం బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన కలకలం రేపింది. విమానాశ్రయ వర్గాల కథనం ప్రకారం డిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయలు దేరింది.. అందులో ఎక్కాల్సి న ఒక ప్రయాణికుడు సమయానికి చేరుకోలేక పోయాడు. దీంతో ఎలాగైనా ఎక్కాలన్న ఉద్దేశంతో ఆ విమానంలో బాంబు ఉందం టూ కాల్‌ చేసి బెదిరించాడు. అయితే అప్పటికే బయలు దేరిన విమానం విశాఖకు రాత్రి 08.15 గంటలకు చేరుకుంది. డిల్లీ ఏఐ సెక్యూరిటీ అప్రమత్తం చేయడంతో ఇక్కడ సీఐఎస్‌ఎఫ్, బాంబు స్క్వాడ్స్‌లు తనిఖీలు చేసి ఏమీ లేదని నిర్ధారణకు వచ్చాయి. అనుమానాస్పద బాంబు బెదిరింపులకు పాల్పడి, తప్పుడు సందేశం ఇచ్చిన ప్రయాణికుడిని డిల్లీ పోలీసులు అదుపు లోనికి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Share