Current Date: 03 Oct, 2024

ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తీర్మానం..

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను భేషరతుగా విరమించాలి. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. స్టీల్‌ ప్లాంట్‌కు 10,000 కోట్ల రూపాయల నిధులు వెంటనే వర్కింగ్‌ కేపిటల్‌గా కేటాయించాలి. స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని విరమించుకోవాలి. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులను, ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలి. స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితులందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. కాంట్రాక్టు కార్మికులనందరినీ క్రమబద్ధీకరించాలి. రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలి.  

Share