ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరుకు ముందు టీమిండియా తన ప్రాక్టీస్ షెడ్యూల్లో అనూహ్య మార్పులు చేసింది. మంగళవారం ఏర్పడిన చంద్రగ్రహణం కారణంగా, సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రైనింగ్ సెషన్‌ను జట్టు మేనేజ్మెంట్ ఒక గంట పాటు వాయిదా వేసింది. గ్రహణం ముగిసే వరకు వేచి చూసి, రాత్రి 7 గంటల తర్వాతే ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. గ్రహణ సమయాన్ని అశుభంగా భావించే సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని, కీలకమైన సెమీఫైనల్ ముందు ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీ పొడవునా టీమిండియా సభ్యులు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. గంభీర్ ఇప్పటికే కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించగా, బుధవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయానికి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక టోర్నీ విషయానికొస్తే, భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ, వెస్టిండీస్‌పై సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ సెమీస్‌కు దూసుకొచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Share