తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తప్పకుండా కూల్చివేస్తామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని జరుగుతుందని ఆయన హెచ్చరించారు. దాంతో రేవంత్ రెడ్డి కేటీఆర్‌కి దిమ్మతిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు.వాస్తవానికి తెలంగాణ సచివాలయం ఎదురుగా ఐలాండ్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తాము అనుకున్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో బీఆర్‌ఎస్‌కి అవకాశం ఇవ్వకుండా అదే ప్రాంతంలో అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఒకవేళ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అప్పుడు ఒకే ఏరియాలో రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అవుతుంది. దాన్ని ప్రజలు హర్షించరు.
Share