టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రాలేకపోవడానికి అసలు కారణాన్ని భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే వెల్లడించాడు. గత కొంతకాలంగా విరాట్ ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోతున్నాడు. దాంతో కోహ్లీకి ఓ ఉచిత సలహా ఇచ్చాడు కుంబ్లే. ‘‘ఫామ్‌లోకి రావడానికి కోహ్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తనపై తానే ఎక్కువగా ఒత్తిడి పెంచుకుంటున్నాడు. ఈ విషయంలో విరాట్ కాస్త ప్రశాంతంగా ఉండాలి. ఓపెనర్‌గా వచ్చే రోహిత్‌కు వెనుక బ్యాటర్లు ఉండడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అలాగే విరాట్ తర్వాత కూడా బ్యాటర్లు ఉన్నారు. అందుకే అతడు వేరే విషయాలు పట్టించుకోకుండా ఆటపై దృష్టిసారించాలి’’ అని కోహ్లీ వెల్లడించాడు.వైఫల్యం అందరి కెరీర్‌లోనూ ఉంటుంది. కానీ ఒత్తిడి పెంచుకుంటే అసలు ఆట దెబ్బ తింటుంది. అలా కాకుండా ప్రశాంతంగా ఉంటే కచ్చితంగా విరాట్ ఉత్తమమైన ఇన్నింగ్స్ ఆడగలడు అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.